మనం బయట పకోడీలు బజ్జీలు మిక్చర్లు ఏమి తిన్నా అవి పామాయిల్ తో చేస్తారు అనేది తెలిసిందే, అయితే వైద్యులు ఇలాంటి ఆయిల్ తో చేసిన ఫుడ్ కి కాస్త దూరంగా ఉండాలి అని చెబుతున్నారు, ఇప్పుడు ఇంటిలో ఏ పిండి వంట చేసినా పామాయిల్ వాడుతున్నారు కాని ఇది అంత మంచిది కాదు అని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచంలో పామ్ ఆయిల్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశం భారతే. మిగిలిన ఆయిల్ తో పోలిస్తే రేటు తక్కువ ఉండటంతో హోటల్స్ కూడా దీనిని వాడుతున్నారు.పెద్ద పెద్ద కంపెనీలు బిస్కెట్లు, కుకీల తయారీకి పామ్ ఆయిల్నే వాడుతున్నారు.
ఈ ఆయిల్ వంటలు తింటే పిల్లల బ్రెయిన్ దెబ్బతింటూనే ఉంటుంది. అంతేకాదు… పామాయిల్ వల్ల గుండె జబ్బులు వస్తాయి. డయాబెటిస్ ప్రమాదం పొంచి ఉంటుంది. అంతేకాదు పామాయిల్ వల్ల బాడీలో కొవ్వు పేరుకుపోయి… అడ్డమైన రోగాలూ వస్తున్నాయి. సో అందుకే నిపుణులు గానుక నుంచి తెచ్చుకున్న నూనె వాడాలి అని చెబుతున్నారు.