గెలుపు దిశ‌గా పిడిఎఫ్‌ అభ్యర్థి -ఐవిఆర్ వెంకటేశ్వరరావు

గెలుపు దిశ‌గా పిడిఎఫ్‌ అభ్యర్థి -ఐవిఆర్ వెంకటేశ్వరరావు

0
114

ఈ నెల‌లో జరగబోయే గ్రాడ్యుయేట్‌ ఎంఎల్‌సి ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల పిడిఎఫ్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఐవిఆర్‌ గెలుపునకు కృషిచేస్తున్నారు గ్రాడ్యుయేట్స్. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ఇళ్ళ వెంకటేశ్వరరావు ఎంతో కృషిచేశారు, అలాంటి వ్య‌క్తి ఎమ్మెల్సీ అయితే మ‌రింత మంచి చేసే అవ‌కాశం ఉంటుంది అని భావిస్తున్నారు. ఇక ఆయ‌న‌ని గెలిపిస్తే ఆయ‌న చేత‌ల‌తో త‌న ప‌నిత‌నం చూపిస్తా అంటున్నారు. మ‌రి ఆయ‌న చెబుతున్న హామీల గురించి తెలుసుకుందాం.

గెలిపిస్తే చేతలతో చూపిస్తా..
గ్రాడ్యుయేట్స్ ను కలిసి తన విధానాలను వివరిస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకటేశ్వరరావు

1…. నిరుద్యోగుల పరంగా..
ప్రభుత్వశాఖలలో ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయించేందుకు కృషి
రాష్ట్రంలోని పరిశ్రమలు, కంపెనీలలో 80 శాతం ఉద్యోగాలు రాష్ట్ర ప్రజలకే కల్పించేందుకు కృషి
ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకినాడ, ఏలూరులలో స్టడీసర్కిల్స్ ఏర్పాటుకు కృషి
నిరుద్యోగభృతి పెంపు, నిరుద్యోగులకు పరీక్ష ఫీజుల్లో రాయితీ సాధనకు కృషి

2… కాంటాక్టు ఉద్యోగు పరంగా…
కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కు కృషి .
రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సెలవులు, సౌకర్యాల సాధనకు కృషి

3.. చిరుద్యోగుల పరంగా..
కనీస వేతనం రూ.18000/-ల సాధనకు కృషి
ప్రత్యేక వేతన చట్టం, ప్రావిడెంటుఫండ్ సాధనకు కృషి
8లక్షల లోపు ఆదాయంగలవారికి ఆరోగ్యశ్రీ పథకం వర్తింపుకు కృషి

4..ఉద్యోగుల పరంగా
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్థానే పాత పెన్షన్ కు విధానం పునరుద్ధరణకు కృషి
మెరుగైన పి ఆర్ సి కోసం జెఏసికి సహకారం
నగదురహిత సమగ్ర ఆరోగ్య పథకం అమలుకు కృషి

5… ఉపాధ్యాయుల పరంగా..
అడ్ హాక్ సర్వీస్ రూల్స్ ద్వారా తక్షణం ప్రమోషన్లు ఇప్పించేందుకు కృషి
సర్వీస్ రూల్సులో మార్పులద్వారా మరిన్ని ప్రమోషన్ కు అవకాశాల సాధనకు కృషి
ట్రైబల్ వెల్ఫేర్ మున్సిపల్ టీచర్ల సర్వీసులు ఉమ్మడి సర్వీసు రూల్సులో చేర్చేందుకు కృషి
మున్సిపల్ టీచర్లకు పిఎఫ్ సౌకర్యం, ప్రమోషన్ల కొరకు కృషి
ఎయిడెడ్ టీచర్లకు పిఎఫ్, ఇహెచ్ ఎస్ ఆరోగ్య పథకం వర్తింపు, నియామకాలకు కృషి
కెజిబివి, మోడల్ స్కూలు టీచర్లకు ప్రభుత్వ టీచర్లతో సమానంగా సౌకర్యాల కల్పనకు కృషి
398/- స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు సాధనకు కృషి

6..అధ్యాపకుల పరంగా …..
అన్ని కళాశాలల్లో ఖాళీ పోస్టులు భర్తీకి కృషి
కాంట్రాక్టు లెక్చరరు. పార్ట్ టైమ్ లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కృషి

7..ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, అధ్యాపకుల పరంగా..
ఉపాధ్యాయులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డులు సాధనకు కృషి
ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగా పే స్కేలు కొరకు కృషి
పి.ఎఫ్., ఆరోగ్యశ్రీ పథకాల వర్తింపుకు కృషి

8… పెన్షనర్ల పరంగా ..
కమ్యుటేషన్ కాలం 15 సల నుండి 12 సం||ల కుదింపుకు కృషి
రిటైర్మెంట్ గ్రాట్యుటీ 20 లక్షల పెంపుకు కృషి
ఫ్యామిలీ పెన్సనర్లకు చివరి వేతనంలో 50% జీవితకాలపు పెన్సన్గా ఇప్పించేందుకు కృషి
బి.పి, షుగర్ వంటి సాధారణ వ్యాధులకు సైతం ఇహెచ్ ఎస్ పథకం వర్తింపుకు కృషి
ఇన్-కం-టాక్స్ చెల్లింపులు నుండి మినహాయింపుకు కృషి

9…కార్మికుల పరంగా …
కనీస వేతనం రూ.18000/-ల సాధనకు కృషి
అంగన్ వాడీ, ఆశా తదితర స్కీమ్ వర్కర్లకు కార్మికులుగా గుర్తింపు, PF., ESI తదితర బెనిఫిట్స్ కోసం కృషి
మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కృషి
కాకినాడ డీప్ వాటర్ పోర్టులో ఉపాధి అవకాశాలు పెంపు
గ్యాస్ అధారిత పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాల కల్పనకు కృషి

10…గిరిజనుల పరంగా..
ఏజెన్సీలో ఉద్యోగాల కల్పనకై ప్రత్యేక కృషి.
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రత్యేక డిఎస్సి ఏర్పాటుకు కృషి.
పాఠశాలల్లో రక్షిత మంచినీరు, వైద్య సిబ్బంది ఏర్పాటుకు కృషి.
కాంట్రాక్టు ఉద్యోగులో సైతం జిఓ 3 అమలుకు కృషి.
అడ్డతీగల, ఎటపాకలలో డిగ్రీ కాలేజీలు, చింతూరులో డి.యీడి కాలేజీ ఏర్పాటుకు కృషి.

ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు మన కోసం, మనహక్కుల కోసం విశేషంగా కృషి చేసిన ఉపాధ్యాయ ఉద్యమ నేత, UTF పూర్వపు రాష్ట్ర అధ్యక్షులు, మాజీ APJAC సెక్రటరీ జనరల్, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్, కార్మిక,ప్రజాసంఘాలు బలపరచిన పిడిఎఫ్ అభ్యర్థి,
ఇళ్ళ వెంకటేశ్వరరావు (ఐవి) ను యం.ఎల్.సి.గా ప్రధమ ప్రాధాన్యత ఓటు (1) వేసి గెలిపించుకుందాం.