తులసి ఎన్నో ఔషదాలు కలిగిన మొక్క, ఒక్క తులసి ఆకు తింటే చాలు ఏ రోగం రాదు, దంతాలు బాగుంటాయి, కపం పోతుంది, గొంతు నొప్పి జలుబు గొంతు మంట అన్నీ తొలగిపోతాయి, అందుకే విష్ణు ఆలయాల్లో కూడా తులసి తీర్ధం ఇస్తారు, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
మనం తులసిని పరమ పవిత్రంగా కొలుస్తుంటాం. తులసి ఉంట్లో ఉంటే ఇంటికి మంచిది అని కూడా చెబుతారు పెద్దలు.. తులసి రెండు రకాలు ఎర్రపూలు పూసే చెట్టును కృష్ణతులసి అని తెల్లపూలు పూసే చెట్టును లక్ష్మీతులసి అని పిలుస్తుంటారు.
మీకు జలుబు చేసినా గొంతు నుంచి కపం పడుతున్నా తులసి ఆకులు కడుక్కుని తింటే చాలు రోజుకి రెండు మూడుసార్లు తింటే మీకే తేడా కనిపిస్తుంది, కడుపులో నొప్పి క్రిములు ఉన్నా పోతాయి, తులసి ఆకులు రోజూ రెండు మూడు తీసుకుంటే జలుబు అనేది మీ దరిచేరదు.
అంతేకాదు సాధారణ జ్వరాలు ఏవి వచ్చినా తులసి ఆకులతో కషాయం కాచి తాగితే తగ్గిపోతుంది.
తరచుగా ఉబ్బసానికి గురయ్యేవారు తులసి కషాయం తీసుకుంటూ ఉంటే కొన్నాళ్లకు ఉబ్బసం రాదు.
ఇక చివరన ఎవరైనా చనిపోయే సమయంలో ఉంటే వారికి తులసి నీరు పోస్తారు, ఈ సమయంలో ఇలా చేయడం వల్లవారి గొంతులో కఫం ఏమైనా అడ్డు ఉంటే అది పోయి, శ్వాస సరిగా తీసుకుంటారని ఆవిధంగా బతుకుతారు అని చేస్తారు, అంత గొప్పది ఈ తులసి.