మన దేశంలోనే ముఖేష్ అంబానీ అత్యంత ధనవంతుడు, అంతేకాదు ప్రపంచ ధనంతుల్లో టాప్ 10 లో ఆయనకంటూ స్ధానం ఉంది. ఏప్రిల్ 19,1957 న ముఖేష్ అంబానీ జన్మించారు…ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ కి ముఖేష్ ప్రధమ కుమారుడు. ఈయన్ సోదరుడు అనిల్ అంబానీ.
అలాగే ముఖేష్ కు ఇద్దరు చెల్లెళ్ళు దీప్తి సలగొన్కర్, నైనా కొఠారీ ఉన్నారు. 1970లలో అంబానీ కుటుంబం ముంబై లోని భులేశ్వర్ ప్రాంతంలో ఒక చిన్న రెండు పడకగదుల ఇంట్లో ఉండేవారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు ధీరూభాయ్ కోల్బాలో 14 అంతస్తుల భవనాన్ని కొన్నారు. దాని పేరు సీ విండ్. మొన్న మొన్నటిదాకా ముఖేష్, అనిల్ కుటుంబాలు వేర్వేరు అంతస్తుల్లో ఆ ఇంట్లోనే కలసి ఉండేవారు.
తర్వాత ముఖేష్ అందమైన ఇంటిని నిర్మించారు, మన దేశంలో అత్యంత ఖరీదైన ఇళ్లు ఇదే..
దాని పేరు అంటిలా బిల్డింగ్… ఇప్పుడు ముఖేష్ కుటుంబం ఆ నివాసంలో ఉంటున్నారు . ఈ ఇల్లు సుమారు 2 బిలియన్ డాలర్ల విలువ ఉంటుంది..ఇక ముఖేష్ అంబానీ, ఆయన సోదరుడు అనిల్ ముంబై లో పెద్దర్ రోడ్లోని హిల్ గ్రేంజ్ హైస్కూల్లో చదువుకున్నారు. తండ్రి పిలుపుతో వచ్చి ఆయన వ్యాపారాల్లో ఎంట్రీ ఇచ్చారు, ఇప్పుడు ఈస్టేజ్ కు చేరుకున్నారు.