గతంలో పెద్దలు టిఫిన్లు అవి ఏమీ తినేవారు కాదు ,ఉదయం రాత్రి మిగిలిన చల్తి అన్నం తినేవారు. ఇక లేకపోతే ఉదయం కూడా అన్నం వండుకుని తినేవారు… ఇలా మూడు పూటలా అన్నం మాత్రమే తినేవారు, అయితే ఇప్పుడు ఒక్కపూట మాత్రమే అన్నం తింటున్నారు, ఇక రాత్రి సమయంలో పూర్తిగా పుల్కా చపాతి రోటీ పరాటా రాగి రొట్టె జొన్న రొట్టె ఇలా చేసుకు తింటున్నారు.
ఇదంతా డైట్ లో భాగం అనే చెప్పాలి, వాస్తవానికి ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారు అన్నం ఎంత తిన్నాపర్వాలేదు. ఎందుకంటే వారికి శారీరక శ్రమ పెరిగి ఎక్కువ క్యాలరీల శక్తి అవసరముంటుంది, అదే ఏ పని చేయకుండా ఉండేవారు శారీరక శ్రమ లేని వారు అన్నం తింటే చాలా కష్టం బరువు పెరిగిపోతారు.
అన్నం కూడా సమయానికి తగ్గట్టుగానే తినాలి. పగటి పూట అన్నం తింటే పర్వాలేదు. కానీ రాత్ర పూట తిండిని కట్టడి చేయాల్సిందే. బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అధిక బరువుతో పాటు కొవ్వు శాతం కూడా పెరిగి శరీరానిక చేటు చేస్తుంది, సో రాత్రి పూట రెండు లేదా మూడు రొట్టెల కంటే మించి తినద్దు అవి ఎక్కువ తిన్నా శరీరానికి చేటు చేస్తుంది. ఒకవేళ మాకు రోటి పుల్కా కష్టం అనుకుంటే రాత్రి 7 గంటలకి అన్నం మితంగా తినండి సులువుగా జీర్ణం అవుతుంది.