హోం క్వారంటైన్ రూల్స్ మార్చిన ఆ స్టేట్ గవర్నమెంట్

హోం క్వారంటైన్ రూల్స్ మార్చిన ఆ స్టేట్ గవర్నమెంట్

0
99

కరోనా వైరస్ కేసులు దారుణంగా బయటపడుతున్నాయి, రోజుకి 40 వేల కేసులు మన దేశంలో నమోదు అవుతున్నాయి, అయితే ఈ సమయంలో ఎక్కడ నుంచి అయినా విదేశాల నుంచి మన దేశానికి వస్తే కచ్చితంగా వారిని క్వారంటైన్ చేస్తున్నారు..

విమానాలు దిగగానే క్వారంటైన్ చేస్తున్నారు. విదేశాల నుంచి, ఇతర రాష్రాల నుంచి వచ్చేవారిని 28 రోజులు లేదా 14 రోజుల హోం క్వారంటైన్లో ఉంచేవారు అధికారులు. అసోం ప్రభుత్వం కూడా క్వారంటైన్ సమయాన్ని కుదించింది.

కరోనా బారినపడి కోలుకుని డిశ్చార్జ్ అయిన తర్వాత హోం క్వారంటైన్ సమయాన్ని కుదిస్తూ అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 14 రోజులుగా ఉన్న హోం క్వారంటైన్ గడువును తాజాగా ఏడు రోజులకు కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది… ఇక ఇప్పటి వరకూ కోలుకున్న వారికి ఇస్తున్న రెండు వేల రూపాయల వస్తువులు పంపిణీ కూడా ఆపేస్తున్నారు, పేదలకు మాత్రమే ఇవి ఇవ్వనున్నారు.