తెలుగు వారిలో సౌందర్య తెలియని వారు ఉండరు.. దాదాపు 100 సినిమాల్లో ఆమె నటించింది, నిర్మాతగా కూడా ఆమె మారింది, అద్బుతమైన నటన అందం ఆమె సొంతం, అయితే ఆమె చిన్న వయసులోనే మరణించడం అందరిని కలిచివేసింది.
ఆమె జ్ఞాపకార్ధం సౌందర్య స్మారక పురస్కారంను కర్ణాటకాంధ్ర లలితకళ అకాడమి వారు ప్రతీ సంవత్సరం ఉగాది పండుగ రోజున ఉత్తమ నటీమణులకు బహుకరిస్తున్నారు. తెలుగులో హీరో వెంకటేష్ చిరుతో నాగార్జునతో ఆమె పలు సినిమాలు చేశారు. ఇక మొత్తం ఆమె ఆరు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలనందుకొన్నారు. అలాగే మూడు ప్రతిష్టాత్మక నంది పురస్కారాలను అందుకున్నారు.
సౌందర్య తన మేనమామ తన బాల్య స్నేహితుడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు అయిన జి.ఎస్.రఘును 2003 ఏప్రిల్ 27లో వివాహం చేసుకున్నారు.. ఆమె ఓ అనాధాశ్రయాన్ని, ఓ పాఠశాలని అమర సౌందర్య విద్యాలయం పేరుతో స్థాపించారు. తన తమ్ముడు అమరనాథ్ సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.
2004లో జరిగిన లోక్సభ ఎన్నికలలో బీజేపీ కి ప్రచారం చేశారు ఆమె. అదే ఏడాది ఏప్రిల్ 17న బెంగళూరు లోని జక్కూరు విమానాశ్రయం నుంచి అప్పటి ఉమ్మడి ఏపీ లోని కరీంనగర్ లో పార్లమెంట్ అభ్యర్థి విద్యాసాగర్రావు తరపున ప్రచారం చెయ్యడానికి చార్టెర్డ్ విమానంలో బయలుదేరారు. ఆ విమానంలో సౌందర్య, ఆమె సోదరుడు అమరనాథ్ ఉన్నారు. దురదృష్టవశాత్తు విమానం గాలిలోకి ఎగిరి కొన్ని క్షణాలకే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం ఆవరణంలో కుప్పకూలిపోవడంతో చనిపోయారు.