పీసీఓడీ..పాలిసిప్టిక్ ఓవరీస్ డిసీజ్ ఇది చాలా మందిని వేదిస్తోంది, ఈ సమస్య ఉంటే సంతానానికి కూడా కాస్త అడ్డంకులు అంటున్నారు వైద్యులు, ముఖ్యంగా బరువు పెరగకూడదు, జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి, ఆందోళన లేకుండా, మానసిక ప్రశాంతత ఉండాలి, వ్యాయామం చేయాలి. లక్షణాలు చూస్తే.
రుతుచక్రం సరిగా రాకపోవడం
పిరియడ్స్ సరిగా లేక పోవటం
నెల ముందు నెల తర్వాత 15 రోజుల గ్యాప్ కు పిరియడ్ సైకిల్ మారడం
మీకు పొత్తి కడుపులో నొప్పి , అధిక రక్తస్రావం ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి
ఇక ఈ సమస్య ఉంటే తక్కువ బ్లీడింగ్ ఎక్కువ బ్లీడింగ్ కనిపిస్తుంది
అలాగే అండం సరిగ్గా విడుదల కాదు
ఫలదీకరణానికి ఇబ్బందులు ఏర్పడతాయి
ఎన్ని ఏళ్లు అయినా చికిత్స తీసుకోకపోతే సంతానానికి ఇబ్బందులు వస్తాయి
బరువు అనూహ్యంగా పెరుగుతారు
తలపై జుట్టు తగ్గిపోవడం,
బహుమూలాల్లో వెంట్రుకలు వస్తాయి
ఎక్కువగా మొటిమలు ముఖంపై వస్తాయి.
ఇలాంటి సమస్య ఉంటే, డాక్టర్ ని సంప్రదించండి, వెంటనే పీసీఓడీ సమస్యకు అలా్ట్రసౌండ్ పెల్విక్ ఆర్గాన్ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు.