మీ దంతాలు పుచ్చిపోకుండా మెరవాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి ?

మీ దంతాలు పుచ్చిపోకుండా మెరవాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి ?

0
93

మనిషి పళ్ల వరస చూసి అతని ఆరోగ్యం చెప్పవచ్చు, అతని పళ్ల వరస నవ్వు ఆ తెల్ల దంతాలు బట్టీ అతని ఆరోగ్యం కూడా చాలా మంది చెబుతారు, అయితే సరిగ్గా పళ్లపై శ్రద్ద పెట్టకపోతే చాలా ప్రమాదం, దంతక్షయం వస్తుంది, చిన్నతనంలో గుర్తించకపోతే పుచ్చిపోయిన దంతాలు అలాగే ఉండిపోతాయి.

అయితే అలా పుచ్చిపోవడం వల్ల కలిగే పంటి నొప్పి వర్ణనాతీతం. చాలా మంది ఈ పంటి నొప్పిని భరించలేరు, అయితే పుచ్చిపోవడం లేకుండా పళ్లు బాగా ఉండాలి అంటే ఈ నియమాలు పాటించండి

1..ముందు మీరు ఏమి తిన్నా వెంటనే మంచినీరు తాగి నోటిలో నీరు వేసి పుక్కలించాలి
2.. వారానికి ఒకసారి అయినా మీరు వేప పుల్లతో పల్లు తోముకోండి
3. లేదా మీకు వేపచెట్లు దగ్గర ఉంటే అసలు పేస్టు మానేసి వేప పుల్ల వాడండి
4. పాచికి కూడా వేప పుల్ల వాడండి
5.ఇక నెలకి ఒకసారి అయినా నిమ్మ బేకింగ్ సోడా వేసి మీ పళ్లపై పెడితే పచ్చ గార ఉంటే పోతుంది
6.చాక్లెట్లు స్వీట్లు జిగురు హల్వా జిలేబీ లాంటివి తింటే 4 నిమిషాల్లో పళ్లు శుభ్రం చేసుకోవాలి లేదా నీటితో పుక్కలించుకోవాలి
7..విటమిన్ డి తక్కువవారిలో కీళ్ళ నొప్పులతో పాటు.. పళ్లు పుచ్చిపోతాయి. అది మీరు తెలుసుకోవాలి
8. డ్రింకులు ఐస్ క్రీమ్స్ కు గుడ్ బై చెప్పండి