రాగి జావ తాగుతున్నారా కలిగే పది ప్రయోజనాలు ఇవే ? ఇలా చేసుకోండి

రాగి జావ తాగుతున్నారా కలిగే పది ప్రయోజనాలు ఇవే ? ఇలా చేసుకోండి

0
146

చాలా మంది ఈరోజుల్లో షుగర్ తో బాధపడేవారు సోడి జావ అని రాగి జావ అని మజ్జిగలో కలిపి తాగుతూ ఉంటున్నారు, మనం చాలా ఇళ్లల్లో చూస్తు ఉంటాం, ఇది శరీరానికి చలువ చేస్తుంది, మంచి పోషకాలు ఉంటాయి, అందుకే డాక్డర్లు కూడా రాగి జావ తాగమని చెబుతారు.

అయితే చిరు ధాన్యాల్లో రాగులు చాలా మంచివి గొప్ప పోషకాలు ఉన్న ధాన్యం.రాగుల్లో ఉండే ప్రొటీన్లు రోజూ వ్యాయామం చేసేవారికి చక్కగా ఉపయోగపడుతాయి. వారిలో కండరాల నిర్మాణానికి తోడ్పడుతాయి. అందుకే ఎదిగే పిల్లలకు రాగి జావ ఇవ్వాలంటారు.

ఇక రాగి జావ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం, రాగి పిండి రెండు స్పూన్లు తీసుకుని కొద్దిగా గిన్నెలో నీరు వేసి కలపండి, దానిని స్టౌవ్ పై పెట్టండి ఇలా ఆ రాగి జావని చిక్కగా కలపండి, మొత్తం చిక్కగా అయిన తర్వాత ఉండలు కట్టుకుండా చూసుకోవాలి, అది చల్లారిన తర్వాత నేరుగా మంచినీరు కలిపి తీసుకున్నా మంచిదే, లేదా చల్లటి మజ్జిగతో తీసుకుంటే ఇంకా మంచిది. రాగుల్లో క్యాల్షియం పుష్కలం. అందువల్ల ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. అందుకే రాగి జావ పిల్లలకు ఇవ్వండి పెద్దలు తీసుకోండి.