ఈ కరోనా సమయంలో అడుగు బయటపెట్టాలి అంటే భయపడుతున్నారు జనం, ఈ సమయంలో ఉదయం 6 నుంచి 9 గంటల వరకూ పాలు నిత్యవసరాలకు సమయం కేటాయించారు, దాదాపు ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా కర్నూలు అనంతపురంలో కేసులు ఎక్కువ వస్తున్నందున ఇక్కడ లాక్ డౌన్ ప్రకటించారు.
చాలా మున్సిపాలిటీలు గ్రామాల్లో సంపూర్ణ లాక్ డౌన్ అమలు అవుతోంది. ఈ సమయంలో బ్యాంక్ ఉద్యోగులు కూడా అక్కడక్కడా ఈ వైరస్ బారినపడుతున్నారు. అలాగే ఆంక్షలు అమల్లో ఉండటంతో దానికి తగ్గట్లుగా జిల్లాలవారీగా బ్యాంకు పనివేళల్లో మార్పులు చేశారు.
ప్రకాశం జిల్లాలో నేటి నుంచి బ్యాంకులకు ఆంక్షలను జిల్లా అధికార యంత్రాంగం అమలు చేయనుంది. జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. కృష్ణా జిల్లాలో కూడా ఇవే నిబంధనలు అమల్లోకి రానున్నాయి, మరికొన్ని జిల్లాలు ఇదే పాటిస్తున్నాయి. కేవలం ఉదయం నుంచి ఆఫ్టర్ నూన్ వరకూ మాత్రమే పనివేళలు అని తెలియచేశారు.