బన్నీ కొరటాల శివ చిత్రంలో బన్నీ రోల్ ఏమిటంటే?

బన్నీ కొరటాల శివ చిత్రంలో బన్నీ రోల్ ఏమిటంటే?

0
100

ఈ ఏడాది బన్నీఅల వైకుంఠపురం చిత్రం చేశారు, ఇక తాజాగా పుష్ప సినిమా చేస్తున్నారు.. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది, అయితే సెట్స్ పై ఉన్న ఈ సినిమా కోవిడ్ కారణంగా షూటింగ్ నిలిపివేశారు.

అయితే మరో రెండు నెలలు అయినా సమయం పడుతుంది అంటున్నారు చిత్ర ప్రముఖులు, ఈ సమయంలో సమయం వేస్ట్ చేయడం లేదు హీరోలు.. కొత్త కధలు వింటున్నారు, అలాగే బన్నీ కూడా దర్శకుల దగ్గర కధలు వింటున్నారట.

తాజాగా కొరటాల శివ చెప్పిన లైన్ స్టోరీ బాగుంది అని బన్నీ ఒకే చేశారట, దీనిపై టాలీవుడ్ లో తెగ ప్రచారం జరుగుతోంది, సోషల్ మెసేజ్ ఇచ్చే సినిమాలు చేస్తారు కొరటాల శివ, అయితే బన్నీ తో కూడా ఈసారి సరికొత్తగా సినిమా తీయనున్నారు. ఇక ఇందులో కాలేజీ.. స్టూడెంట్ రాజకీయాలు.. వంటి అంశాలను ఆయన చూపించనున్నారట. బన్నీ స్టూడెంట్ లీడర్ గా సరికొత్త తరహా పాత్రలో కనిపిస్తాడట. సో దీనిపై ఇంకా అధికారక ప్రకటన అయితే రావాల్సి ఉంది, కొరటాల ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న విషయం
తెలిసిందే.