దేశంలో ఆల్ టైం హైకి చేరిన బంగారం ధ‌ర ఈరోజు రేట్లు ఇవే

దేశంలో ఆల్ టైం హైకి చేరిన బంగారం ధ‌ర ఈరోజు రేట్లు ఇవే

0
86

దేశంలో బంగారం ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి, భారీగా బంగారం ధ‌ర‌లు పెరుగుతున్నాయి, హైద‌రాబాద్ లో బంగారం ధ‌ర భారీగా పెరిగింది, బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.640
పెరిగింది.

ఇప్పుడు మార్కెట్లో రూ.54,940కు చేరింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.590 పెరుగుదలతో రూ.50,370కు చేరింది, గ‌డిచిన ఏడు రోజులుగా బంగారం ధ‌ర‌లు ఇలాగే పెరుగుతున్నాయి.

కాని వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2700 పతనమైంది. దీంతో ధర రూ.62,000కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేక‌పోవ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణం అంటున్నారు నిపుణులు. వ‌చ్చే రోజుల్లో ఇంకా బంగారం ధ‌ర పెరుగుతుంది అంటున్నారు బులియ‌న్ వ్యాపారులు.