బోయపాటి బాలయ్య సినిమాలో మరో సీనియర్ హీరోయిన్

బోయపాటి బాలయ్య సినిమాలో మరో సీనియర్ హీరోయిన్

0
80

స్నేహ టాలీవుడ్ కోలీవుడ్ లో ఎన్నో మంచి హిట్ సినిమాలు చేసింది, అంతేకాదు, తెలుగులో అగ్రహీరోలు అందరితో ఆమె సినిమాలు చేశారు.ఇటు జూనియర్స్తో పాటు సీనియర్ స్టార్స్తో నటించిన స్నేహ అవకాశాలు తగ్గడంతో ప్రసన్న అనే తమిళ నటుడిని 11 మే 2012 న చెన్నైలో వివాహం చేసుకుంది.

ఇక పెళ్లి తర్వాత సరికొత్త పాత్రలు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నారు. గతంలో రామ్ చరణ్ వినయ విధేయ రామలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగులో ఆమె మరో చిత్రాన్ని చేయనుంది అని వార్తలు వస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ సరసన ఆమె నటించనున్నట్టు తెలుస్తోంది.

తాజాగా బోయపాటి శ్రీనుతో బాలయ్య చేస్తున్న సినిమాలో స్నేహ ఓ కీలక పాత్ర చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.డబుల్ రోల్లో ఉన్న బాలయ్య భార్యగా స్నేహ కనిపిస్తుందట. స్నేహది హీరోయిన్ పాత్ర కాకపోయినా ఒకరకంగా సెకెండ్ హీరోయిన్ పాత్ర చెప్పవచ్చు. ఇక బాలయ్యతో పలు సినిమాల్లో ఆమె గతంలో నటించింది…పాండురంగడుస- మహారథిచిత్రాల్లో ఆమె నటించింది. కరోనా లాక్ డౌన్ తర్వాత ఈ షూటింగ్ స్టార్ట్ అవ్వనుంది అని తెలుస్తోంది.