ముద్దులు తెగ ఇస్తున్నారా అయితే ఇది తప్పక తెలుసుకోండి

ముద్దులు తెగ ఇస్తున్నారా అయితే ఇది తప్పక తెలుసుకోండి

0
105

ముద్దుముచ్చట దీని గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు, అందరూ ఇచ్చేదే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికి ఇస్తారు, అయితే ముద్దు వల్ల శరీరానికి మంచిది అని గతంలో నిపుణులు చెప్పారు, ఈ కరోనా సమయంలో మాత్రం ముద్దుకి దూరంగా ఉండాలి లేకపోతే పాజిటీవ్ వస్తుంది అంటున్నారు.

అయితే సాధారణంగా ఏ జబ్బు లేనివారు ఇవ్వడం వల్ల ఒక ముద్దు శరీరంలోని 150 నుంచి 200 క్యాలరీల శక్తిని కరిగిస్తుంది. ముద్దు వలన ముఖంలోని 24 కండరాలు యాక్టివ్ అవుతాయి. ముద్దు వలన గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. కాని అన్నీ ముద్దులు ఒకేలా ఉండవు డేంజర్ ముద్దులు కూడా ఉంటాయి.

కొంతమంది లాలాజలంతో ఎప్స్టీన్ బార్ అనే వైరస్ ఉంటుంది. ఇది ప్రాణాంతకమైన వైరస్. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తే తీవ్రమైన అనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది.తలనొప్పి, ఫీవర్ వంటివి వస్తాయి. క్రమంగా మెదడు మొద్దుబారిపోతుంది. ఈ వ్యాధిని మోనో న్యూక్లియోసిస్ లేదా మోనో లేదా కిస్సింగ్ డిసీజ్ అని పిలుస్తారు, అది ఎవరికి ఉందో తెలియడం కష్టం అంటున్నారు నిపుణులు.