మన ఇళ్లల్లో ఏదైనా శుభకార్యం జరిగినా లేదా ఏదైనా పండుగ జరిపినా మనం స్వీట్లు పంచుతాం, మరి దేశంలో ఆ అయోధ్య రాముని ఆలయానికి భూమి పూజ రోజున పెద్ద పండుగా దీనిని అందరూ భావిస్తున్నారు.. ఆగస్టు 5న అయోధ్యలో రామమందిర నిర్మాణం భూమిపూజను కూడా తీయని వేడుకగా జరిపేందుకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేసింది.
వీరు అన్నీ దేశాల రాయబార కార్యాలయాలు స్వీట్లు పంపించనున్నారట. ఇందుకోసం 16 లక్షల బికనేర్ లడ్డూలను ఆర్డర్ చేశారు. మొత్త 4 లక్షల ప్యాకెట్ల లడ్డూలను ఆర్డరిచ్చారని.. ఒక్కో ప్యాకెట్‌లో నాలుగు లడ్డూలు ఉంటాయని తెలిసింది. లక్నో, ఢిల్లీలో వీటిని తయారు చేస్తున్నారు.
ఆగస్టు 5న భూమి పూజ సందర్భంగా ఢిల్లీలోని అన్ని దేశాల ఎంబసీలతో పాటు అయోధ్యలోనూ స్వీట్లు పంచనున్నారు. 1,11,000 లడ్డూలను అక్కడ అయోధ్యలోని భూమి పూజ కోసం సిద్దం చేస్తున్నారు, భూమి పూజ అయ్యాక రాముడి ప్రసాదంగా అక్కడ వారికి అందరికి పంచనున్నారు.భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా 50 మంది వీఐపీలు హాజరువుతారని తెలుస్తోంది.మొత్తం రూ.326 కోట్ల ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేస్తారు. దీనిని దేశం అంతా ప్రత్యక్షప్రసారం ఇవ్వనున్నారు.