ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు… ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది.. ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా కూడా కోవిడ్ తన విజృంభన కొనసాగిస్తూనే ఉంది…
దీంతో జగన్ సర్కార్ ప్రజలకు కావాల్సిన సదుపాయలు కల్పిస్తుంది ఈ క్రమంలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది… రోడ్డు టాక్స్ కట్టేందుకు గడువు పెంచింది… రోడ్డు టాక్స్ కట్టేందుకు ఇచ్చిన గడువు నేటితో మూగీయనుంది.. దీంతో రోడ్డు టాక్స్ గడువును పెంచుతూ జగన్ సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది…
లాక్ డౌన్ కారణంగా నష్టాల్లో ఉన్న ఆటో టాక్సీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారనే అంశం ప్రభుత్వం దృష్టికి వచ్చింది.. దీంతో ఏపీ సర్కార్ రోడ్డు టాక్స్ ను కట్టేందుకు సెప్టెంబర్ నెలాఖరి వరకు గడువును పెంచింది.. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ఉత్తర్వూలను జారీ చేసింది..