దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట విషాదం

దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట విషాదం

0
114

ఈ క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలో ప‌లువురు సినీ ప్ర‌ముఖుల మ‌ర‌ణాలు అంద‌రిని క‌న్నీరు పెట్టించాయి, కొంద‌రికి క‌రోనా వ‌స్తే మ‌రికొంద‌రికి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చాయి, అయితే తాజాగా టాలీవుడ్ లో ఓ విషాదం నెల‌కొంది.

టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల తండ్రి కమ్ముల శేషయ్య (89) ఈ రోజు ఉదయం 6 గంటలకు
అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్దికాలంగా ఆయ‌న అనారోగ్యంతో ఉన్నారు, ఈ స‌మ‌యంలో ఆయ‌న చికిత్స తీసుకుంటున్నారు.

అయితే వ‌య‌సు పెర‌గ‌డం ప‌లు అనారోగ్య బాధ‌ల కార‌ణంతో మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది..ఈ రోజు సాయంత్రం బన్సీలాల్ పేట శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌ని ప‌లువురు ప్ర‌ముఖులు ఫోన్లో ప‌రామ‌ర్శించారు.