తాళి కట్టిన భర్తను కాదని కొంతమంది మహిళలు పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు.. చివరకు ప్రియుడిమీద మోజుతో భర్తలను హత్య చేయిస్తున్నారు.. తాజాగా ఇలాంటి సంఘటనే ముంబైలో జరిగింది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
శివాజీ నగర్ ఏరియాకు చెందిన అహదుల్లా యాస్మిన్ దంపతులు ఇటీవలే అహదుల్లా అకస్మాత్తుగా మృతి చెందాడు దీంతో ఆయన భార్య యాస్మిన్ తన భర్త మరణించాడని చెప్పింది.. దీంతో అహదుల్లా మృతిపై తమ్ముడికి అనుమానం వచ్చింది.. ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నౌషద్ ఖాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు..
అతనిని పోలీసులు విచారించగా అసులు విషయం బయటకు వచ్చింది.. తనకు యాస్మిన్ తో అక్రమ సంబంధం ఉందని తన అక్రమ సంబంధానికి అహదుల్లా అడ్డువస్తున్నాడనే ఉద్దేశంతో హత్య చేశామని తెలిపారు… ఇందుతు యాస్మిన్ కూడా సహకరించిందని తెలిపారు..