తెలంగాణలో మందు బాబులకి గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్, అవును ఈ కరోనా వైరస్ లాక్ డౌన్ వేళ ఎక్కడా మద్యం దుకాణాలు తెరవలేదు, అయితే అన్ లాక్ పిరియడ్ నుంచి మద్యం దుకాణాలు తెరచుకున్నాయి, ఇక కేసులు సంఖ్య తగ్గుతున్న వేళ తెలంగాణలో మరో కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్.
మద్యం దుకాణాల వేళలను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాత్రి 9.30 గంటల వరకు అనుమతి ఉండగా, ఇప్పుడు దానిని మరో గంటన్నర పెంచారు. ఫలితంగా రాత్రి 11 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచే ఉండనున్నాయి.
అయితే దీని వల్ల కచ్చితంగా భౌతిక దూరం పాటిస్తారు, అలాగే మాస్క్ ధరించిన వారికి మాత్రమే మద్యం ఇస్తున్నారు లేకపోతే వారికి ఫైన్ వేస్తున్నారు, ఈ జాగ్రత్తలు తీసుకుని నేటి నుంచి మద్యం షాపులు తెరవాలి అని తెలియచేశారు.