కరోనా మహమ్మారి అందరిని హడలెత్తిస్తోంది, ఏపీలో కేసులు సంఖ్య మరింత ఎక్కువగా ఉంది, ముఖ్యంగా ఇక్కడ ప్రజా ప్రతినిధులకి కూడా వైరస్ సోకడంతో వారు కూడా ఆస్పత్రికి క్వారంటైన్ కు చికిత్సకు వెళుతున్నారు..ఇప్పటికే చాలా మంది నేతలు వైరస్ సోకి కోలుకోగా.. ఇంకా కొంత మంది చికిత్స పొందుతున్నారు.
అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి కరోనా పాజిటివ్ అని తేలగా.. తాజాగా మంగళవారం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వైరస్ బారినపడ్డారు.చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు కరోనా సోకింది. అంతేకాదు ఆయనని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు, ఆయనకు ఆరోగ్యం బాగానే ఉంది అని కుటుంబ సభ్యులు తెలిపారు, అంతేకాదు ఉదయమే మరో ఎమ్మెల్యేకి పాజిటవ్ అని తేలింది.
ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు కూడా ఆస్పత్రిలో చేశారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఒంగోలులోని రమేష్ సంఘమిత్ర వైద్యశాలలో పరీక్షలు చేయించుకున్నారు. ఆయనతో పాటు ఆయన భార్యకు కూడా పాజిటివ్ అని వచ్చింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకి వైరస్ సోకడంతో వారు చికిత్స పొందుతున్నారు, అయితే నేతలు కార్యకర్తలు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలియచేస్తున్నారు.