బ్రేకింగ్ – ఏపీలో మంత్రికి క‌రోనా పాజిటీవ్

బ్రేకింగ్ - ఏపీలో మంత్రికి క‌రోనా పాజిటీవ్

0
138

ఏపీలో నాయ‌కుల‌ని క‌రోనా వ‌ద‌ల‌డం లేదు, క‌రోనా దారుణంగా రెచ్చిపోతోంది, విజృంభ‌ణ కేసులు చూస్తుంటే దారుణంగా ఉన్నాయి.ఇక ప‌లువురు ఎమ్మెల్యేల‌కి కూడా క‌రోనా సోకింది, తాజాగా నిన్న ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కి క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే.

తాజాగా ఏపీ మంత్రికి క‌రోనా సోకింది… విద్యుత్, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆయ‌న హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స కోసం అడ్మిట్ అయ్యారు.
దీంతో ఆయ‌న‌ని క‌లిసిన వారు అంద‌రూ కూడా హోం క్వారంటైన్ లో ఉంటున్నారు.

అయితే బ‌య‌ట కార్య‌క్ర‌మాల‌కు వెళ్ల‌డం పెద్ద ఎత్తున బిజీ వ‌ర్క్ ఉండ‌టంతో నేత‌ల‌కు కూడా వైర‌స్ సోకుతోంది, అందుకే వీలైనంత వ‌ర‌కూ త‌క్కువ మందితోనే కార్యక్ర‌మాలు చేసుకోవాలి అని చెబుతున్నారు అధికారులు, అయితే రెండు రోజులుగా ఆయ‌న జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నారు, దీంతో అనుమానంతో ప‌రీక్ష చేయించుకుంటే క‌రోనా అని తేలింది.