బ్రేకింగ్ – దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి క‌న్నుమూత

బ్రేకింగ్ - దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి క‌న్నుమూత

0
105

టీఆర్ ఎస్ పార్టీ శ్రేణుల‌లో విషాదం నింపింది ఓ వార్త .పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు ఎమ్మెల్యే క‌న్నుమూశారు….టీఆర్ఎస్ నేత, సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన కన్నుమూశారు.

ఈ విష‌యాన్ని కుటుంబ సభ్యులు తెలిపారు, ఆయ‌న సీఎం కేసీఆర్ కు స‌న్నిహితుడిగా ఉన్నారు, ఉద్యమ స‌మ‌యం నుంచి ఆయ‌న ముందుండి పోరాటం చేశారు. రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో విషాదఛాయలు అలముకున్నాయి.

ఆయ‌నకు భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు. 2004లో తొలిసారిగా దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, 2008 ఉప ఎన్నికల్లో గెలిచారు. ఆపై 2009లో ఓటమి పాలైనా, 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు. ఆయ‌న ప‌లు ప‌త్రిక‌ల్లో కొంత కాలం జ‌ర్న‌లిస్టుగా కూడా ప‌నిచేశారు, పేద‌ల‌కు ఎంతో సాయం చేశారు, ఆయ‌న మ‌ర‌ణంతో పార్టీ శ్రేణులు సంతాపం తెలిపాయి.