ఈ ఏడాది ముఖేష్ అంబానీ సంపద అమాంతం పెరుగుతోంది, అలాగే అపరకుబేరుల జాబితాలో కూడా ముందుకు సాగుతున్నారు ముఖేష్ అంబానీ, జియోతో మొత్తం దిశ మారింది అంటున్నారు అనలిస్టులు.
తాజాగా సంపద మళ్లీ భారీగా పెరగడంతో ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన నాలుగో స్థానానికి చేరారు.
బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 80.6 బిలియన్ డాలర్ల నికర సంపదతో ముఖేశ్ నాలుగో స్థానంలో నిలిచారు.ఎల్వీఎంహెచ్ సంస్ష ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ను తాజాగా ఆయన దాటేశారు
వారెన్ బఫెట్, ల్యారీ పేజ్, ఎలాన్ మస్క్ కు దాటి ముందుకు వచ్చారు మన భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ.
ఇక వరల్డ్ లో ముందు ప్రపంచ కుబేరుడిగా ప్రధమ స్ధానంఅమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ది, ఆయన 187 బిలియన్ డాలర్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు… 121 బిలియన్ డాలర్లతో బిల్ గేట్స్, 102 బిలియన్ డాలర్లతో మార్క్ జుకర్ బర్గ్ 3వ స్ధానంలో ఉంటే, నాల్గోస్ధానం ముఖేష్ అంబానీ నిలిచారు.