బాలకృష్ణ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరోకి ఛాన్స్ ?

బాలకృష్ణ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరోకి ఛాన్స్ ?

0
85

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య బాబు బోయ‌పాటి కాంబోలో ఓ చిత్రం వ‌స్తోంది, ఇప్ప‌టికే క‌రోనా లాక్ డౌన్ తో షూటింగ్ కు బ్రేకులు ప‌డ్డాయి, అయితే ఈ సినిమాలో చాలా మంది సీనియ‌ర్ న‌టులు ఉన్నారు అని తెలుస్తోంది, డిఫ‌రెంట్ క‌థ‌గా బాల‌య్య ఇప్ప‌టి వ‌ర‌కూ క‌నిపించ‌ని లుక్ లో క‌నిపిస్తారు అని అంటున్నారు టాలీవుడ్ లో.

అయితే . బిబి3 వర్కింగ్ టైటిల్ తో సినిమాను షూట్ చేస్తున్నారు. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక బాలీవుడ్ న‌టిని ఇందులో కొత్త‌గా హీరోయిన్ గా తీసుకోనున్నారు, అయితే ఈ సినిమా గురించి మ‌రో వార్త వినిపిస్తోంది.

ఈ సినిమాలో నవీన్ చంద్ర ఓ పాత్రలో నటిస్తున్నారు. ఇంతకుముందు ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు. మళ్ళీ ఇప్పుడు బాలయ్య సినిమాలో నటించబోతున్నాడు. ఇక పొలిటిక‌ల్ ట‌చ్ పాత్ర‌లో న‌వీన్ ఎమ్మెల్యేగా చేయ‌నున్నారు అని తెలుస్తోంది.