దాదాపు పది రోజులుగా పసిడి పరుగులు పెట్టింది.. కాని తాజాగా రెండు రోజులుగా పసిడి ధర తగ్గుదల
కనిపిస్తోంది. బంగారం ధర ఈరోజు కూడా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 తగ్గింది. దీంతో
రూ.58,470కు పడిపోయింది.
అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.230 తగ్గడంతో రూ.53,580కు దిగొచ్చింది. బంగారం ధర ఇలా ఉంటే వెండి ధర మాత్రం ఆల్ టైం రికార్డులు నమోదు చేస్తోంది.
కేజీ వెండి ధర ఏకంగా రూ.940 పెరిగింది. దీంతో ధర రూ.75,150కు చేరింది. ఇక వచ్చే రోజుల్లో బంగారం ధర తగ్గే ఛాన్స్ లేదు అంటున్నారు వ్యాపారులు, పెద్ద ఎత్తున షేర్లలో కాకుండా బంగారంలో పెట్టుబడి పెడుతున్న కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి అంటున్నారు.