ఈ కరోనా వైరస్ కి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు, అయితే ఇప్పటికే రష్యా దీనికి సంబంధించి టీకాని విడుదల చేసింది, ఇప్పటికే ఆ దేశంలో నిన్నటి నుంచి చాలా మందికి టీకాలు ఇచ్చారు.
అయితే మన దేశంలో 20 లక్షల పాజిటీవ్ కేసులు దాటేశాయి. ఈ వ్యాక్సిన్ కోసం భారత్ సహా ఎనిమిది దేశాలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నం అయ్యాయి. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ వంటి సంస్థలు కరోనా వ్యాక్సిన్ ను రూపొందించాయి.
ఇక హ్యూమన్ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి, ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం నాటికి కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకుని రావడానికి ప్రయత్నాలు సాగిస్తామంటూ ఇదివరకే ఐసీఎంఆర్ వెల్లడించింది. దీంతో ఇప్పుడు అందరి చూపు ఆగస్టు 15కి చేరింది..ఆగస్టు 15వ తేదీ నాటి తన ప్రసంగంలో ప్రధాన మోడీ దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు, ఇదే కనుక జరిగితే మరికొన్ని నెలల్లో మనకు వ్యాక్సిన్ వస్తుంది.