టాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ మేన్ గా డాక్టర్ రాజశేఖర్ కు ఎంతో పేరు ఉంది, యాక్టర్ గా ఆయన తనకంటూ ప్రత్యేకమైన స్ధానం సంపాదించుకున్నారు, ఇక ఫ్యామిలీ హీరో అయ్యారు రాజశేఖర్ ..ఈ మధ్య వరుసగా మంచి కథలు ఎంచుకుంటున్నారు ఆయన.
ఎమోషనల్, యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలలో తనదైన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఇక గరుడవేగ సినిమాతో విజయాన్ని అందుకున్నారు. అయితే, ఆ తర్వాత ఆయన చేసిన కల్కి మాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. దీంతో కాస్త డిఫరెంట్ జోనర్ సినిమాలు చేయాలి అని భావిస్తున్నారు ఆయన.
ఇక రాజశేఖర్ తాజాగా ఓ దర్శకుడితో సినిమా ఒకే చేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి..షో- మిస్సమ్మ విరోధి ఇలాంటి ఉత్తమ చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు నీలకంఠ ఓ స్టోరీ చెప్పారట, ఈ కథ నచ్చడంతో రాజశేఖర్ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది, ఇక కథ పై స్టోరీ వర్క్ చేయనున్నారట.