ప్రముఖ వీడియో యాప్ టిక్‌టాక్ అతి పెద్ద మార్కెట్ ఇండియాలో కలిగి ఉంది, కాని ఇండియాలో ఈ యాప్ నిలిపివేయడంతో చాలా వరకూ యూజర్ మార్కెట్ కోల్పోయింది, అంతేకాదు అమెరికా కూడా ఇప్పుడు టిక్ టాక్ కు షాక్ ఇచ్చింది.
ఈ సమయంలో తన యూజర్ బేస్‌ను కాపాడుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది, మన దేశంతో చర్చలు జరుపుతోంది, అలాగే కంపెనీ స్టాక్స్ విక్రయించే విషయంలో పలు కంపెనీలతో చర్చలు జరుపుతోంది, అమెరికాకి చెందిన మైక్రోసాఫ్ట్ ట్విట్టర్ తో ఇప్పటికే బైట్‌డ్యాన్స్ చర్చలు జరిపింది.
తాజాగా ఇండియాలో తన మార్కెట్ కాపాడుకోవడానికి రిలయన్స్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
గత నెలలోనే ఈ రెండు కంపెనీల మధ్య చర్చలు ప్రారంభమైనట్లు తెలిసింది. అయితే, ఒప్పందం ఇంకా ఓ కొలిక్కి రాలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది, మరి చూడాలి దీనిపై రిలయన్స్ కూడా ఎక్కడా ఎలాంటి ప్రకటన చేయలేదు.