టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత చేస్తున్న చిత్రం వకీల్ సాబ్, అయితే తమ నటుడి సినిమా చూడాలి అని పవన్ అభిమానులు ఎంతో ఆత్రుతగా చూస్తున్నారు, ఈ సమయంలో వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ అయితే కాస్త బ్రేకులు పడింది, దాదాపు 90 శాతం చిత్రీకరణ పూర్తి అయింది.
తాజాగా తెలుస్తున్న వార్తల ప్రకారం ఇక మెయిన్ లీడ్ స్టోరీ 10 శాతంషూటింగ్ చేయాల్సి ఉందట, దీనిని కూడా త్వరలో ఫినిష్ చేయాలి అని భావిస్తున్నారు..వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ చాలా వేగంగానే చేశారు.
దిల్రాజు-బోనీకపూర్ సంయుక్త నిర్మిస్తోన్న ఈమూవీలో ప్రకాశ్రాజ్ మరో లాయర్గా కనిపించనున్నాడు. శృతిహాసన్ కీలకపాత్రలో నటిస్తోంది. మొత్తానికి షూటింగ్ పూర్తి అయిన తర్వాత దీనిపై పూర్తి అప్ డేట్ అయితే అభిమానులకి ఇవ్వనుంది చిత్ర యూనిట్. ఇక జస్ట్ పది రోజులు పవన్ షూటింగ్ కు వస్తే చాలు అని ఇటు అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు.