పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ చిత్రం చేస్తున్నారు,ఈ సినిమా తర్వాత ఆయన క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు, ఇప్పటికే ఈ సినిమా స్టార్ట్ అయింది, అయితే కరోనా సమయంలో లాక్ డౌన్ తో షూటింగులకి బ్రేకులు ఇచ్చారు.
అయితే పవన్ షూటింగ్ కు కాస్త సమయం పట్టేలా ఉంది ,అందుకే క్రిష్ మరో సినిమాని కూడా స్టార్ట్ చేయాలి అని చూస్తున్నారట, అంతేకాదు మరోవైపు వెబ్ సిరీస్లు కూడా చేస్తున్నాడు.
సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో కొత్త సినిమా మొదలైంది.
ఫారెస్ట్ నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్ జరగనుంది. నాన్ స్టాప్ షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నాడు క్రిష్. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించబోతుంది, అయితే ఈ సినిమా కంప్లిట్ చేస్తూనే, కుదరితే నవంబర్ నుంచి పవన్ సినిమా కూడా సెట్స్ పై పెట్టనున్నారట, సో వకీల్ సాబ్ పూర్తి అవ్వగానే పవన్ ఈ చిత్రం పై ఫోకస్ చేయనున్నారు.