యువతుల పెళ్లి వయసుపై కేంద్రం త్వరలో నిర్ణయం

యువతుల పెళ్లి వయసుపై కేంద్రం త్వరలో నిర్ణయం

0
86

స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకల్లో భాగంగా అనేక కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ. హెల్త్ కార్డ్ ప‌థ‌కం గురించి తెలియ‌చేశారు, ఒక్క కార్డులో ఆ వ్య‌క్తి డీటెయిల్స్ అన్నీ ఇక భ‌ద్ర‌ప‌రుస్తారు, దేశంలో ప‌లు సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌స్తోంది మోదీ స‌ర్కార్.

అంతేకాదు యువతుల పెళ్లి వయసుపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు ప్ర‌ధాని మోదీ..
దీనికి సంబంధించిన ఓ కమిటీని నియమించామని కమిటీ నివేదిక వచ్చిన తరువాత యువతుల వివాహం విషయంపై ఓ నిర్ణయం తీసుకుని ప్రకటిస్తామని తెలిపారు.

దీనిపై మ‌హిళ‌లు ఆనందం వ్య‌క్తం చేశారు. ఇక మహిళల్లో పోషకాహార లోపాల నివారణకు చర్యలు ప్రారంభించినట్టు చెప్పారు. దేశంలో మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే దేశ భవిష్యత్తు ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. 18 ఏళ్ల వివాహ వయసుతో ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు చాలా మంది, అందుకే కేంద్రం కూడా దీనిపై ఆలోచ‌న చేస్తోంది.