రమేష్ హాస్పటల్ యజమాని రమేష్? హీరో రామ్ కి ఏమవుతారో తెలుసా

రమేష్ హాస్పటల్ యజమాని రమేష్? హీరో రామ్ కి ఏమవుతారో తెలుసా

0
92

మొత్తానికి ఏపీలో ఈరోజు హీరో రామ్ చేసిన ట్వీట్ పెను సంచలనం అయింది.. అయితే హీరో రామ్ ఏం ట్వీట్ చేశారంటే..పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది సీఎంని తప్పుగా చూపించడానికి ysjagan garu.మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ రెప్యుటేషన్ కి, అలాగే మీ మీద మేం పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది.వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నా అని రాశారు.

అయితే ఈ ట్వీట్ చూసి రామ్ ఇలా ఎందుకు పెట్టారు అని ప్రతీ ఒక్కరు చర్చించుకున్నారు.అంతే కాకుండా హోటల్ స్వర్ణ ప్యాలస్ ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్ గా మార్చక ముందు , ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు ? అని కూడా రాశారు.

అయితే తాజాగా తెలుస్తున్న వార్తల ప్రకారం…నటుడు రామ్ రంగ ప్రవేశం ఎందుకు చేశాడు అనేది టాక్ .
అయితే ఈ రమేష్ ఆస్పత్రి యజమాని రమేష్ బాబు సోదరుడి కుమారుడే ఈ హీరో రామ్ అని అంటున్నారు పెద్దలు, అయితే తన బాబాయి కావడంతో రమేష్ బాబుకు అండగా రామ్ రంగప్రవేశం చేశాడు అంటున్నారు టాలీవుడ్ లో అందరూ.