నోకియా నుంచి మరో అదిరిపోయే ఫోన్

నోకియా నుంచి మరో అదిరిపోయే ఫోన్

0
83

ఇప్పటి యువతకు చాలా మందికి అనేక స్మార్ట్ ఫోన్లు వచ్చాయి, కాని గతంలో పదేళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ఫోన్ అంటే నోకియా అనే చెప్పాలి.. బేసిక్ మోడల్ ఫోన్ల్ చాలా మంది వాడేవారు .అన్నీ చాలా వరకూ నొకియా ఫోన్లు ఉండేవి, అయితే స్మార్ట్ ఫోన్లు కొన్ని వందల సంఖ్యలో ఇప్పుడు వచ్చాయి.

అయితే తాజాగా నోకియా మరో సరికొత్త ఫీచర్ ఫోన్ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.
స్మార్ట్ఫోన్లకు బదులుగా అధునాతన ఫీచర్లతో రూపొందించిన ఫోన్ను త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనుంది.

ఇప్పటికే ప్రముఖ కంపెనీ నోకియా 5310 ఎక్స్ప్రెస్ మ్యూజిక్ ఫోన్ను విడుదల చేసింది. ఈ ఫోన్ మాదిరిగానే త్వరలో మరొక ఫీచర్ ఫోన్ను తీసుకువస్తుంది. మోడల్ నంబర్ TA-1316 పేరుతో తయారు చేసిన ఫోన్కు యూఎస్ ఎఫ్సీసీ ఆమోదం తెలిపినట్లు తెలిసింది. ఈ ఫోన్ కూడా 4జీ కనెక్టివిటీతో
ఎల్టీఈ 5,7, 38 బ్యాండ్లను సపోర్ట్ చేయనుంది, ఇందులో రెండు సిమ్స్ పని చేస్తాయి. ఇవి ఎప్పుడు మార్కెట్లోకి వస్తాయో ఇంకా ప్రకటించాల్సి ఉంది.