భార్య అక్రమ సంబంధం బయటపెట్టిన గూగుల్ మ్యాప్ ఎలా అంటే ?

భార్య అక్రమ సంబంధం బయటపెట్టిన గూగుల్ మ్యాప్ ఎలా అంటే ?

0
122

భర్తకు తెలియకుండా భార్య ప్రియుడితో రాసలీలలు నడిపింది.. కాని టెక్నాలజీ ఆమెని పట్టించింది, సో ఈ సంఘటన ప్రపంచం అంతా వైరల్ అయింది, మరి ఏమి జరిగిందో తెలుసుకుందాం.

గూగుల్ మ్యాప్ వాడే వారు ఏ లొకేషన్లో ఎక్కడ ఉన్నారో రికార్డ్ చేస్తుంది. అలాగే రెండు ప్రదేశాల మధ్య డిస్టాన్స్ కూడా చెబుతుంది. పెరూ దేశానికి చెందిన అతను… రాజధాని లిమాలోని పాపులర్ బ్రిడ్జికి వెళ్లి… అక్కడ స్ట్రీట్ వ్యూ ఆన్ చేశాడు.

అక్కడ అనేక రకాల ఫోటోలు కనిపించాయి, అయితే అందులో ఓ ఫోటో జూమ్ చేశాడు, అందులో ఎవరా అని చూస్తే తన భార్య కనిపించింది, ఆమె ఓ వ్యక్తి ని తన ఒళ్లో పడుకోబెట్టుకుని కూర్చుంది, ఈ ఫోటోలో ఉన్నది అతను కాదు, ఆమె ప్రియుడు దీంతో అతనికి కోపం నషాలానికి అంటింది.

ఇంటికి వెళ్లి భార్యని ఆ ఫోటోల గురించి ఆరాతీశాడు, ఆమె ముందు ఒప్పుకోలేదు పూర్తిగా అన్నీ నిరూపించడంతో ఆమె ఒప్పుకుంది, దీంతో ఆమెకి విడాకులు ఇస్తున్నాను అని తెలిపాడు, మొత్తానికి గూగుల్ మ్యాప్ తన భార్య బండారం బయటపెట్టింది అని ఈ విషయం సోషల్ మీడియాలో పంచుకున్నాడు.