గతంలో గ్యాస్ కావాలి అంటే ఆ పుస్తకం తీసుకుని ఏజెన్సీకి వెళ్లి బిల్ కొట్టించేవారు, కాని వచ్చే రోజుల్లో మొత్తం ఆన్ లైన్ అయింది, ఆన్ లైన్ లో చేసుకోవచ్చు జస్ట్ మిస్ట్ కాల్ ఇచ్చి గ్యాస్ బుక్ చేసుకోవచ్చు, ఇలా వాట్సాప్ లో కూడా బుక్ చేసుకునే సదుపాయం వచ్చింది.
అయితే తాజాగా గ్యాస్ బుకింగ్ రూల్స్ మారాయి అని తెలుస్తోంది, గ్యాస్ సరఫరాలో అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఈ రూల్స్ తీసుకువచ్చారట..గ్యాస్ సిలిండర్ బుక్ చేసే వారు ఇకపై కచ్చితంగా ఓటీపీని తెలియజేయాలి. కస్టమర్లు ఓటీపీ చెబితేనే గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తారు. లేదంటే సిలిండర్ డెలివరీ తీసుకోవడం కుదరదు.
చాలా స్టేట్స్ లో గ్యాస్ సిలిండర్ బ్లాక్ మార్కెట్ లకు వెళుతున్నాయి, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారట, ఇప్పటికే ఈ రూల్ చాలా ప్రాంతాల్లో అమలులోకి వచ్చింది. మీరు గ్యాస్ బుక్ చేసిన వెంటనే మీ మొబైల్ నంబర్ కు వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది, ఆ పాస్ వర్డ్ కచ్చితంగా డెలివరీ బాయ్ కి చెప్పాలి ఓటీపీ చెబితేనే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తారు. లేదంటే లేదు. ఇక ఏదైనా కారణాలతో ఓటీపీ రాకపోతే మీరు ఆధార్ కార్డ్ మీ గ్యాస్ బుక్ చూపించాలి. ఈ ఆలోచన కూడా చేస్తోంది కేంద్రం.