బ్యాంక్ అకౌంట్ ప్రతి ఒక్కరికీ అవసరమే, అంతేకాదు ఏ ప్రభుత్వ పథకం అయినా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతోంది ఆ నగదు, అయితే కొందరికి ఒక అకౌంట్ ఉంటే మరికొందరికి రెండు అంతకు మించి నాలుగు ఐదు అకౌంట్లు కూడా ఉన్నాయి, అయితే వాటిని సరిగ్గా మెయింటైన్ చేస్తే పర్వాలేదు, కాని వాటిని నిరూపయోగంకా పట్టించుకోకుండా వదిలస్తే ప్రమాదం.
అదనంగా ఉన్నటువంటి ఉపయోగించని బ్యాంక్ అకౌంట్ను వీలైనంత త్వరగా క్లోజ్ చేసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారంటే అందులో మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి. దాదాపు ఇలాంటి అకౌంట్లు కొన్ని లక్షల్లో ఉన్నాయట.
ఇలా వాడకుండా అకౌంట్ ఉంచితే చార్జీల బాదుడు మొదలవుతుంది.
ఇక ఆ ఖాతాకు ఏదైనా లింక్ అయి ఉందో లేదో చూసి ఆ ఖాతాను క్లోజ్ చేసుకోండి. తర్వాత డీ లింక్ చేసుకోవడం కుదరదు, మీ ప్రభుత్వ పథకాలు అన్నీ ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయ్యాయో చూసుకోవాలి, గ్యాస్ నగదు కూడా ఎందులో జమ అవుతుందో చూసుకోవాలి. ఇక ఉద్యోగులు కంపెనీ మారిన సమయంలో కొత్త కంపెనీ కొత్త బ్యాంకు ఖాతా ఇస్తుంది, ఇలా చేసిన సమయంలో పాత కంపెనీ ఇచ్చినా శాలరీ బ్యాంకు ఖాతాను క్లోజ్ చేసుకోరు. దీని వల్ల ఛార్జీలు దారుణంగా పడతాయి, సో ఇది కూడా వీలైతే రెండు మూడు నెలలకే క్లోజ్ చేసుకోవాలి. పాత అకౌంట్లో వరుసగా మూడు నెలలు జీతం పడకపోతే ఆ అకౌంట్ సాధారణ అకౌంట్గా మారిపోతుంది.