బంగారం ధరలు ఆల్ టైం హైకి చేరి మళ్లీ నేలచూపులు చూస్తున్నాయి, గడిచిన వారం రోజుల్లో భారీగా తగ్గింది బంగారం ధర, పుత్తడి తగ్గుదలలో అంతర్జాతీయంగా ఇదే సీన్ కనిపిస్తోంది. ఇక మార్కెట్లో చూస్తే దేశీయంగా బంగారం కొనుగోళ్లు అమ్మకాలు తగ్గాయి, ఇది కూడా తగ్గుదలకు ప్రధాన కారణం.
కరోనా సమయంలో నగదు లేక ఆభరణాలు చాలా మంది తీసుకోవడం లేదు, అయితే తగ్గిన బంగారం ధరలు చూస్తే. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.2930 పడిపోయింది ఈ వారం. దీంతో రూ.58,690 స్థాయి నుంచి రూ.55,760కు దిగొచ్చింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాములకు రూ.2,690 దిగొచ్చింది. రూ.51,110కు చేరింది.
ఇకబంగారం ధరలు ఇలా ఉంటే వెండి ధరలు కూడా ఇలానే ఉన్నాయి, వెండి ధర కూడా భారీగా తగ్గింది.వెండి ధర కేజీకి ఏకంగా రూ.7250 తగ్గింది. రూ.66,950కు చేరింది. ఇక వచ్చే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉంది అంటున్నారు నిపుణులు.