7 గంటల పాటు శ్రీలంకలో మొత్తం పవర్ కట్ కారణం ఇదే

7 గంటల పాటు శ్రీలంకలో మొత్తం పవర్ కట్ కారణం ఇదే

0
94

ఒక్క నిమిషం కరెంట్ లేకపోతే చాలా సమస్యలు అనేక పనులు ఆగిపోతాయి, అయితే ఒక ప్రాంతంలో అయితే పెద్ద విషయం కాదు సరిచేస్తే వెంటనే వస్తుంది, కాని ఏకంగా దేశంలో మొత్తం కరెంట్ పోతే అది చరిత్ర అవుతుంది, తాజాగా ఇలాంటి దారుణమైన స్దితి శ్రీలంకకు వచ్చింది.

విద్యుత్ సరఫరాలో లోపం కారణంగా శ్రీలంక దేశం మొత్తం అంధకారంలో మగ్గాల్సివచ్చింది. ఏడు గంటలపాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మొత్తం ప్రజలు ఇబ్బంది పడ్డారు,
రాజధాని కొలంబోకు వెలుపల ఉన్న కేరవాలాపిటి విద్యుత్ కాంప్లెక్స్ దగ్గరు టెక్నికల్ సమస్య వచ్చింది, దీంతో ఈ సమస్య ఏర్పడింది.

ఏడు గంటల తర్వాత కొలంబోలో విద్యుత్ పునరుద్ధరించబడింది. అయితే ఇంకా కొన్ని ప్రాంతాలు చీకట్లో ఉన్నాయి, కొలంబోలో ఎంతో ఇబ్బంది పడ్డారు అందరూ, అంతేకాదు అక్కడ రహదారుల దగ్గర సిగ్నల్ వ్యవస్ధ పనిచేయలేదు ట్రాఫిక్ కు ఇబ్బందులు వచ్చాయి, ఇక ఫ్యాక్టరీలు, అలాగే ఏటీఎంలు , బ్యాంకులు ఇలా అన్నీ సర్వీసులు నిలిచిపోయాయి అని తెలుస్తోంది..శ్రీలంక థర్మల్ పవర్ ద్వారా విద్యుత్తులో సగానికి పైగా ఉత్పత్తి చేస్తుంది అని తెలుస్తోంది. ఇప్పుడు పవర్ రావడంతో అక్కడ జనం ఊపిరిపీల్చుకున్నారు.