ఎండుద్రాక్ష ఈ రోజుల్లో చాలా మంది వీటిని తింటున్నారు, అయితే శరీరానికి ఆరోగ్యానికి ఇది చాలా మంచిది, అంతేకాదు ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి, ముఖ్యంగా ఎండు ద్రాక్ష నానబెట్టిన వాటర్ కూడా చాలా మంది తీసుకుంటారు, ఇక దీనిని చాలా వరకూ బెంగాలీ స్వీట్స్ లో బాగా వాడతారు. లడ్డూలకు కూడా ఇది తప్పక రుచికి వాడతారు.
బరువు తగ్గాలనుకునేవారికి ఎండుద్రాక్షల్ని రాత్రిపూట నానబెట్టుకుని ఉదయం తింటే సరి. వీటిల్లోని గ్లూకోజ్ శరీరానికి శక్తినిస్తుంది. ఈనీరు కూడా తాగవచ్చు, ఇక శరీరంలోని ఇమ్యునిటీ పవర్ పెంచుతుంది, అలాగే కొంచెం తిన్నా పొట్ట నిండిన అనుభూతి వస్తుంది. ఇక శరీరంలో కొవ్వు ఉన్నా చెడు కొలెస్ట్రాల్ ఉన్నా అంతా పోతుంది.
ఇక మహిళలకు క్యాల్షియం లోపం ఉంటే దానికి ఇది చెక్ పెడుతుంది, ఇక రోజుకి నాలుగు ఐదు ఎండుద్రాక్ష తీసుకున్నా చాలా మంచిది, ఇక పాలల్లో వేసుకుని నానబెట్టుకుని కూడా వీటిని తీసుకోవచ్చు.
ఇక ఎముకలకు బలాన్నీ కూడా ఇస్తాయి. ఇక నెలసరి సమస్యలు ఉన్న మహిళలు వీటిని తీసుకోవచ్చు, ఇందులో ఐరెన్ పుష్కలంగా అందుతుంది. నోటి నుంచి దుర్వాసన వస్తే మీరు భోజనానికి రెండు గంటల ముందు ఈ రెండు ఎండు ద్రాక్షల్ని బాగా నమిలితే దుర్వాసన సమస్య తగ్గుతుంది.