త్రివిక్రమ్ కోసం ముగ్గురు హీరోలు వెయిటింగ్…

త్రివిక్రమ్ కోసం ముగ్గురు హీరోలు వెయిటింగ్...

0
84

ఈ ఏడాది అలావైకుంఠపురంలో చిత్రం బ్లాక్ బ్లస్టర్ అందుకున్న దర్శకుడు త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయనున్న సంగతి తెలిసిందే… ఆర్ ఆర్ ఆర్ చిత్రం పూర్తి అయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి రానుంది… అయితే కరోనా వైరస్ కారణంగా టైమ్టేబుల్ మొత్తం మారిపోయింది… రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం షూటింగ్ పూర్తి అవ్వడానికి సుమారు ఏడాది పడుతుంది…

ఇప్పుడున్న సమయంలో యంగ్ టైగర్ తో త్రివిక్రమ్ మూవీ మొదలైయ్యే ఛాన్స్ లేదని చర్చించుకుంటున్నారు… ఇక ఎన్టీఆర్ తర్వాత మాటల మాంత్రికుడు బన్నీతో మరో సినిమా చేయనున్నాడు అయితే ఇప్పుడు బన్నీ కూడా రెండు పెద్దప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.. దీంతో బన్నీతో వర్కౌట్ కాదు…

అయితే త్రివిక్రమ్ తో సినిమా తీయడానికి ముగ్గురు స్టార్ హీరోలు రెడీగా ఉన్నారట… చిరంజీవి పవన్ కళ్యాణ్ అలాగే వెంకటేష్ లు త్రివిక్రమ్ తో సినిమా తీయాలని చూస్తున్నారట… మరి ఈ ముగ్గురిలో ఎవరికి ఓకే చెబుతారో చూడాలి… కాగా త్రివిక్రమ్ వెంకటేష్ తో ఒక సినిమా తీయాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…