ఈ మధ్య కొందరు యువతులని వ్యభిచార కేంద్రాలకు అమ్మేస్తున్నారు, వారి వలలో పడి ఉద్యోగాలు వస్తాయి అని నమ్మి ఏకంగా ఇతర రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా ఇక్కడకు వస్తున్నారు, చివరకు ఇక్కడకు వచ్చిన తర్వాత ఉద్యోగాలు కాకుండా వ్యభిచారం చేయిస్తున్నారు, ఇలా ఎందరో చిక్కుకుపోయారు.
ఉద్యోగాల పేరుతో బంగ్లాదేశ్ నుంచి యువతులను అక్రమంగా భారత్లోకి తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న ముఠాపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
వీరు ఉపాధి పేరుతో బంగ్లాదేశ్ అమ్మాయిలను హైదరాబాద్ తీసుకొచ్చారు, వారి దగ్గరకు విటులని తీసుకువచ్చి సుఖం అందించాలి అని కోరేవారు.
లేదంటే ఇక్కడే చంపేస్తాము అని బెదిరించే వారు, ముఠా సభ్యులు అమ్మాయిల పాస్పోర్టులు లాక్కుని బలవంతంగా ఇలా బ్రోకర్ హౌస్ లో అమ్మేస్తున్నారు, అందుకే అమ్మాయిలు జర జగ్రత్త ఉద్యోగాల పేరుతో ఎవరైనా ఇలాంటి పనులు చేయాలని భావిస్తే , మీకు కాస్త అనుమానం వచ్చినా పోలీసులకు తెలియచేయండి.