అర్జున్ రెడ్డి , పెళ్లి చూపులు, గీతాగోవిందం, ఈ సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ, అతని స్టైల్ మాట అన్నీ కూడా అభిమానులకి నచ్చుతాయి, ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరో అయ్యాడు, అయితే హిట్లకి కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాడు విజయ్. ఇప్పుడు ఆయన పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత విజయ్ ఏ సినిమా చేస్తారు అనే టాక్స్ అయితే నడుస్తున్నాయి టాలీవుడ్ లో, తాజాగా ఆయన ఈ సినిమా తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సినిమా చేయనున్నారట.
విభిన్నమైన సినిమాలను తెరకెక్కిస్తూ విజయాలు అందుకుంటున్నారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, నిర్మాతలకు అతి తక్కువ బడ్జెట్ తో ఆయన సినిమాలు పూర్తి అవుతాయి.
అయితే తాజాగా ఆయన విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్నాడని వినిపిస్తోంది. సుమారు 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను తీసుకోనున్నట్టు చర్చించుకుంటున్నారు, అయితే దీనిపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.