భారీగా త‌గ్గిన బంగారం వెండి ధ‌ర‌లు ఈ రోజు రేట్లు ఇవే

-

బంగారం ధ‌ర మార్కెట్లో కాస్త త‌గ్గుముఖం ప‌డుతోంది. నాలుగు రోజులుగా బంగారం ధ‌ర కాస్త త‌గ్గుతోంది, ఇక మార్కెట్లో నేడు కూడా ప‌సిడి ధ‌ర త‌గ్గింది.హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.400 త‌గ్గింది. దీంతో ధర రూ.55,060కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.360 త‌గ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.50,480కు పడిపోయింది.

- Advertisement -

పసిడి ధర పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. భారీగానే తగ్గింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.700 దిగొచ్చింది. దీంతో ధర రూ.67,100కు చేరింది. ఇక వ‌చ్చే రోజుల్లో బంగారం ధ‌ర మ‌రింత త‌గ్గే అవ‌కాశాలు ఉన్నాయి అంటున్నారు బులియ‌న్ వ్యాపారులు.

షేర్ల ర్యాలీ పెరుగుతోంది, ఈ స‌మ‌యంలో బంగారం కంటే షేర్ల‌లోనే పెట్టుబ‌డి పెడుతున్నారు ఇన్వెస్ట‌ర్లు. అందుకే ప్ర‌ధానంగా బంగారం ధ‌ర త‌గ్గుతోంది అంటున్నారు బులియ‌న్ వ్యాపారులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...