హస్తిన వర్గాల్లో రాజకీయ నేతల్లో ఈ రోజు ఓ అంశం పెద్ద ఎత్తున చర్చకు కారణం అయింది, .కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ రాజీనామా చేయబోతున్నారనే వార్త వైరల్ అయింది, అయితే ఆమె రాజీనామా చేస్తే పార్టీకి తర్వాత ఎవరు అధ్యక్షుడుగా వస్తారు అనే చర్చ జరుగుతోంది.
మరి ఆ రేసులో ఎవరు ఉన్నారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న..రాహుల్ రాజీనామాతో సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు… నెటిజన్లు దీని గురించే చర్చించుకుంటున్నారు.. కాంగ్రెస్ కార్యకర్తల్లో ఎక్కువ మంది రాహుల్ గాంధీ వైపే మొగ్గు చూపుతున్నప్పటికీ రాహుల్ ఇందుకు సుముఖంగా ఉన్నారా లేదా అనేది ప్రధానమైన ప్రశ్న.
అయితే దేశంలో ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతల్లో వినిపిస్తున్న పేర్లు చూస్తే, శశి థరూర్, సచిన్ పైలట్, అమరీందర్ సింగ్, అశోక్ గెహ్లోత్, సిద్ధరామయ్య పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
శశిథరూర్ పలుమార్లు కేంద్ర మంత్రిగా పని చేశారు కేరళకు చెందిన నేత. ఇక పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. అలాగే సచిన్ పైలట్ …కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. మరి ఎవరు వస్తారో చూడాలి.