ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పరిపాలనలో దూసుకుపోతున్నారు, ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనే విషయం తెలిసిందే, ఇక ఆయన పిల్లలు ఇద్దరూ కూడా చదువుల సరస్వతులు అనే చెప్పాలి, అంతేకాదు వారు ప్రఖ్యాత యూనివర్శిటీలో సీటు సంపాదించి మంచి ఉన్నత చదువు చదువుతున్నారు.
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సీటు రావటంతో జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డి గ్రాడ్యుయేషన్ లో చేరిన సంగతి తెలిసిందే, అయితే ఈసారి మరో సీటు కూడా ఆమె సంపాదించారు.
సీఎం జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డి ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు సాదించారు. దాంతో హర్షారెడ్డి యూనివర్సిటీ లోని పారిస్ క్యాంపస్లో మాస్టర్స్ డిగ్రీ చదవనున్నారు.
ఆమె జాయిన్ అయ్యేందుకు మంగళవరాం పారిస్ వెళ్లనున్నారు, అయితే సీఎం జగన్ కూడా కుమార్తెను పారిస్ పంపించేందుకు మంగళవారం బెంగుళూరు వెళ్లనున్నారు.ఈ విషయం తెలిసన వైసీపీ నేతలు విద్యావంతులు ఆమెని అభినందిస్తున్నారు.