మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తోంది అంటే అది పండుగ అనే చెప్పాలి, రాజకీయాల నుంచి తప్పుకుని ఆయన మళ్లీ సినిమాలు చేస్తూ వరుసగా సక్సెస్ లు అందుకుంటున్నారు,ఖైదీ నెంబర్ 150 సినిమాతో దాదాపుగా పదేళ్ల తరువాత సినిమాల్లోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు, అయితే ఆయన ఫాలోయింగ్ అలాగే ఉంది.
టాలీవుడ్ లో మెగాస్టార్ గా ఆయన రికార్డులు క్రియేట్ చేస్తున్నారు, అయితే తర్వాత సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి అద్బుతంగా నటించారు.
ఇక ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది.
ఇక తర్వాత చిరు చేయబోయే చిత్రాలు ఏమై ఉంటాయి అనే చర్చ జరుగుతోంది, అంతేకాదు పలువురు దర్శకులు చెబుతున్న కథలు కూడా ఆయన వింటున్నారట. సాహో దర్శకుడు సుజీత్ మలయాళ మూవీ లూసిఫర్ తెరకెక్కిస్తారట, ఆచార్య తర్వాత ఈ సినిమా స్టార్ట్ అవ్వనుంది.
ఇక నెక్ట్స్ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుతో మెగాస్టార్ మూవీ ఉంటుందని అద్బుతమైన పాత్ర చిరు ఇందులో చేస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి, ఇక నెక్ట్స్ ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా ఓ సినిమా చేయనున్నారట ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్టోరీ అని టాక్ వినిపిస్తోంది, సో ఆచార్య తర్వాత మూడు చిత్రాలు మెగాస్టార్ ఫిక్స్ చేశారు అని టాలీవుడ్ టాక్.