ఇక ప్రయాణికులకు గుడ్ న్యూస్ ఏపీ తెలంగాణ మధ్య బస్సులు నడువనున్నాయి అని తెలుస్తోంది. ఏ రాష్ట్రాల మధ్య కూడా ప్రయాణికులకు ఆటంకాలు కల్పించవద్దని, ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేందుకు వీలు కల్పించాలని కేంద్రం ఆదేశించిన సమయంలో ఏపీ తెలంగాణ ఆర్టీసీ అధికారులు హైదరాబాద్ లో చర్చలకు సిద్దం అవుతున్నారట.
తాజాగా అధికారులతో జరిగిన సమీక్షలో, అంతర్రాష్ట్ర సర్వీసులను ప్రారంభించే అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆదాయం కోల్పోవాల్సిన పరిస్థితిని తెచ్చుకోకుండా, రెండు ఆర్టీసీలూ సమానంగా బస్సులను నడిపేలా చూసుకుంటూ, ఒకే పరిమాణంలో కిలోమీటర్ల లెక్కలు కూడా ఉండేలా డీల్ కుదుర్చుకోవాలని సూచించారట సీఎం కేసీఆర్.
దీంతో ఇక వచ్చే నెలలో కచ్చితంగా ఏపీ తెలంగాణ మధ్య బస్సులు నడిపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది, రెండు రాష్ట్రాల అధికారులు సమావేశం అయి దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలతోనూ ఇదే విధమైన ఒప్పందాలు కుదుర్చుకోవాలని తెలిపారట. తెలంగాణలోకి 1000కిపైగా ఏపీ బస్సులు వస్తుండగా, తెలంగాణ నుంచి ఏపీకి 750 బస్సులే వెళుతుండేవి. సరైన ఒప్పందాలు చేసుకోవాలి అని తెలిపారు.