సినీరంగంలో క్యాస్టింగ్ కౌచ్ అంశం ఎంత పెద్ద దుమారం రేపిందో తెలిసిందే, ముఖ్యంగా శ్రీరెడ్డి బయటకు వచ్చి అనేక విషయాలు చెప్పడంతో, మీడియా ముందు చాలా మంది నటీమణులు హీరోయిన్లు ఆర్టిస్టులు తమ బాధలు చెప్పుకున్నారు, ఆ తర్వాత కొంతమంది ఈ విషయంలో జాగ్రత్త పడ్డారు. అయితే పలువురు హీరోయిన్లు ఈ విషయంలో ఇప్పటికే తమకు ఎదురైన పరిస్దితులు చెప్పారు.
తాజాగా క్యాస్టింగ్ కౌచ్ విషయంపై హీరోయిన్ అనుష్క స్పందించింది. ప్రస్తుతం ఆమె నటించిన నిశ్శబ్దం సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… నేను కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది ఎదుర్కొన్నా అని సంచల కామెంట్ చేశారు ఆమె.
ఇందులో దాచేది ఏమీ లేదు, పరిశ్రమలో ఇలాంటివి ఎదుర్కోవాలి అని తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమలో కూడా ఈ పద్దతి ఉంది అని అన్నారు, తాను ముక్కుసూటిగా ఉన్నాను దైర్యంగా ఉన్నాను దీంతో నేను తప్పించుకున్నాను అని తెలిపింది..కొత్తగా సినీ పరిశ్రమలోకి వచ్చే వారికి క్యాస్టింగ్ కౌచ్ వంటి సమస్యలు తప్పవని తెలిపింది. చూశారుగా పరిశ్రమలో ఉన్న చాలా మంది హీరోయిన్లు ఈ బాధలు ఎదుర్కొన్నవారే అంటున్నారు నెటిజన్లు.