ఇప్పట్లో ఓ పెద్ద ఫామిలీ సపోర్ట్ ఉంటే ఇండస్ట్రీ లో హీరో అయిపోవడం చాల ఈజీ కానీ నిలబడటం ఎంతకష్టమో ఇప్పటికే అలాంటి ఫ్యామిలీల నుండి వచ్చి ఇంకా పూర్తిగా నిలదొక్కుకోలేక పోతున్న చాలా మంది హీరోలకు తెలుసు… అయితే ఎన్టీఆర్ వైపు నుండి కూడా ఒకరు హీరో గా లాంచ్ అవుతున్నారన్న వార్త ఈ మధ్య సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది…
వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ వైఫ్ ప్రణతి తమ్ముడు నార్నె నితిన్ హీరో అవ్వాలనుకుంటున్నట్లు ,ఇప్పటికే తాను యాక్టింగ్ మరియు మార్షల్ ఆర్ట్స్ లోను శిక్షణ తీసుకొంటున్నట్టు సమాచారం… అయితే ఈ సంగతి బావ ఎన్టీఆర్ దాకా వెళ్లడంతో నితిన్ స్పీడ్ కి బ్రేక్ పడ్డట్టుగా అయింది… హీరో అంటే నిజంగా ఓ అంతర్యుద్ధం.. ఇందులోకి ఒకసారి దిగి నిలబడలేక పోతే ఆ పరిస్థితిని తట్టుకునే శక్తీ చాల తక్కువ మందికి ఉంటుందని హీరో కావాలన్న ఆలోచన మానుకోవాలని నితిన్ కి చెప్పినట్టు సమాచారం…
అయితే ఈ విషయం లో నితిన్ బావ మాట వింటాడో లేక మాట వినకుండా తొందరపడి దెబ్బతింటాడో చూడాలి మరి… సీనియర్స్ చెప్పే మాటలు పెడచెవిన పెట్టడం ద్వారా తిరగబడిన జీవితాలు ఇండస్ట్రీ లో చాలానే ఉన్నాయ్…